బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న రియాల్టీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 3’. ఇప్పటికే 40 రోజులకు పైగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఈ వారం ఓ ప్రత్యేకత చోటు చేసుకుంది. ఈ వారం బిగ్ బాస్ షోలో నాగార్జునకు బదులు రమ్యకృష్ణ హోస్ట్ గా వచ్చి సడన్ సర్ ప్రైజ్ ఇవ్వనుంది.

ఇక నాగార్జున ఈ నెల 29న తన 60 వ పుట్టిన రోజు వేడుకల కోసం స్పెయిన్ వెళ్లారు. దీనితో ఆయన చేయవలసిన బిగ్ బాస్ ఎపిసోడ్స్ చేయలేక పోయారు. దీనితో స్టార్ మా యాజమాన్యం రమ్యకృష్ణ ను హోస్ట్ గా వ్యవహరించమని కోరడంతో ఆమె ఒప్పుకున్నారు. కాగా శనివారం ప్రసారమయ్యే షో కు సంబందించిన ప్రోమోను స్టార్ మా అభిమానులతో పంచుకుంది. మరి హోస్ట్ గా రమ్య కృష్ణ ఎలా అలరించబోతుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  
  •  
  •