హైదరాబాద్ మణికొండలో నివసించే రాజ్ కుమార్, ప్రియా క్యాప్ జెమినిలో ఉద్యోగం చేస్తూ మణికొండ మున్సిపాలిటీ కేంద్రంలో నివసిస్తున్నారు. వారి కుమారుడు శరత్ శ్రీ చైతన్య పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. వారి తల్లిదండ్రులిద్దరూ ఇంటి దగ్గరే ల్యాప్ టాప్ లో పనిచేయడాన్ని చిన్నపటి నుండే గమనించిన శరత్.. ఏడేళ్ల వయసులోనే అతనిలో కోడింగ్, జావా తదితర కోర్సులపై ఆసక్తి పెంచుకుని వాటిని నేర్చుకున్నాడు.

దీంతో అతను కూడా తన తల్లిదండ్రులలాగా జాబ్ చేయాలనీ నిర్ణయించుకున్నాడు. అతనిలో టాలంట్ ను గుర్తించిన తల్లిదండ్రులు వివిధ కంపెనీలకు ఇంటర్వ్యూలకు పంపారు. ఇటీవల మోంటైగ్నే కంపెనీలో నెలకు 25 వేల గౌరవ వేతనంతో శరత్ కి ఉద్యోగం వచ్చింది. ఇక శరత్ ని కొన్నిరోజులు చదువుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. మూడు రోజులు స్కూల్ కి వెళ్తాడు, మూడు రోజులు డేటా సైటిస్ట్ గా సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తాడు.

ఇక 12 ఏళ్ళ వయసులోనే 7వ తరగతి చదువుతూ.. డేటా సైటిస్ట్ గా సాఫ్ట్ వేర్ జాబ్ పొందిన శరత్ తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందించారు. ఇక శరత్ తల్లిదండ్రులు ఏపీలో తెనాలి ప్రాంతానికి చెందిన వారు.