ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో ప్రజలంతా ఇళ్లకు పరిమితమవ్వడంతో పాటు ఆన్లైన్ షాపింగ్ విపరీతంగా పెరిగిపోవడంతో అమెజాన్ లాంటి ఈకామర్స్ సంస్థలు మంచి లాభాలను ఆర్జిస్తున్నాయి. దీనిలో భాగంగా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఒక్కరోజులో అత్యధిక సంపాదనకు ఆర్జించిన తొలి వ్యక్తిగా రికార్డులలోకి ఎక్కాడు. స్టాక్ మార్కెట్లో తన కంపెనీ షేర్లు అమాంతం పెరిగిపోవడంతో ఏకంగా 97 వేల కోట్లకు ఆర్జించగలిగాడు. దీనితో బెజోస్ సంపద 14 లక్షల కోట్లకు చేరుకుంది.

ప్రపంచంలో అత్యధిక సంపద గలవారిలో బెజోస్ మొదటి స్థానంలో ఉండగా ఇప్పుడు మరింత పైపైకి వెళుతూ ఎవరకి అందకుండా తన స్థానాన్ని మరింత పదిలపరుచుకున్నాడు. అమెజాన్ సంస్థ ఈకామర్స్ దిగ్గజ సంస్థగా మన భారత్ తో పాటు అనేక దేశాలలో తన సేవలను అందిస్తుంది. దీనితో పాటు అతడి వ్యాపారాభివృద్ధి మరింత విస్తృత పరుచుకోవడంతో బెజోస్ షేర్స్ భారీగా పెరిగినట్లు తెలుస్తుంది.