సినీ నటుడు ఆలీ వైసీపీలో చేరారు. హైదరాబాద్ లో లోటస్ పాండ్ లో జరిగిన కార్యక్రమంలో వైఎస్ జగన్.. ఆలీకి వైసీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భముగా ఆలీ మాట్లాడుతూ.. ప్రజలంతా జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారని ,తాను కూడా అందుకోసం కృషి చేస్తానని ఆయన చెప్పారు.

వైఎస్ జగన్ మాటకు కట్టుబడిఉండే వ్యక్తి అని, తనకు వైఎస్ కుటుంబంతో అనుబందం ఉందని ఆయన అన్నారు. చంద్రబాబు చూద్దాం, చేద్దాం అంటూ కాలయాపన చేసే మనిషి అని అన్నారు. పవన్ కళ్యాణ్ తనకు మంచి మిత్రుడని.. కానీ రాజకీయాలు వేరు సినిమాలు వేరన్నారు.
  •  
  •  
  •  
  •  
  •  
  •