ఆరోగ్యసేతు యాప్ ఇకపై అన్ని స్మార్ట్ ఫోన్లలో తప్పనిసరిగా ఉండబోతుంది. ఇకపై ఆరోగ్యసేతును ఫోన్ లో రిజిస్టర్ చేసుకున్నాకే వినియోగదారుడికి ఆ ఫోన్ పని చేస్తుందట. ఇక నుండి ఫోన్ అమ్మడానికి ముందే ఆ యాప్ ను అన్ని స్మార్ట్ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేయడంతో పాటు ఆ యాప్ లో రిజిస్టర్ చేసుకున్నాకే వినియోగదారుడికి ఆ ఫోన్ ను వాడేలా చూడాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయబోతుంది. ఇందుకు సంబంధించి టెలికామ్ సంస్థలతో మాట్లాడేందుకు ఓ నోడల్ అధికారిని నియమించబోతుంది.

ఇక ఆరోగ్యసేతు యాప్ ను ఇన్‌స్టాల్ చేసుకున్నాక దానిలో అడిగే పలు రకాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి సంబంధీకులతో మనం కాంటాక్ట్ అయ్యామా విదేశాలు ఇతర ప్రాంతాలు వెళ్ళివచ్చామా? కరోనా వైరస్ సోకె లక్షణాలు ఏమైనా ఉన్నాయా? అనే ప్రశ్నలకు జవాబులు ఇవ్వవలసి ఉంటుంది. ఇక వీటి ఆధారంగా మన ఆరోగ్య పరిస్థితి మొత్తం దీనిలో రికార్డు అవుతుంది. ఇక మన చుట్టూ పక్కల ఎవరైనా కరోనా రోగులుంటే అలర్ట్ చేస్తుంది. ఇందుకు కాను జిపిఎస్ ను ఆన్ లో ఉంచుకోవాలి.

ఇక ఈ యాప్ లో కరోనా తాజా సమాచారం తో పాటు కరోనా పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నియంత్రణ చర్యలు వంటి అంశాలన్నీ ఈ యాప్ లో ఉంటాయి. ప్రస్తుతం ఆరోగ్య వివరాలను ఒకసారి మాత్రమే అప్డేట్ చేయాల్సి ఉండగా.. త్వరలో మరింత అప్డేట్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలియచేసారు.

ఫేస్‌బుక్ డేటా పోర్టబులిటీ ఫిచర్..!

వాట్సాప్ లో లోన్లు పొందవచ్చు..!