ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో తెలియని వారంటూ ఉండరు. ఎప్పుడు ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఆ పార్టీనే అధికారంలో ఉండాలని, మిగిలిన పార్టీలన్నీ చెత్త పార్టీలంటూ ఆర్కే కొత్త పలుకులు పేరుతో చెత్త పలుకులు మాట్లాడుతూ నెటిజన్ల చేత బండ బూతులు తిట్టించుకుంటూ ఉంటాడు. తెలంగాణ వచ్చిన కొత్తలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కేసీఆర్ కోపానికి బలై దాదాపుగా కొన్ని నెలల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ బహిష్కరణకు గురైంది.

తరువాత రోజులలో కేసీఆర్ తో కుదిరిన సయోధ్యతో గత మూడు సంవత్సరాలుగా కేసీఆర్ భజన చేస్తూ గడిపారు. ఇక గత నెలలో ఆర్కే కొత్త పలుకులు పేరుతో వచ్చే ప్రోగ్రాం వచ్చే సార్వత్రిక ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి దాదాపుగా 80 నుంచి 100 స్థానాలు వస్తాయని చెప్పి టీఆర్ఎస్ శ్రేణులనే ఔరా అనిపించారు. కేసీఆర్ ను ప్రసన్నం చేసుకోవడంలో అన్ని చానెల్స్ కన్నా ముందు వరుసలో ఉండి, టీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి తీసుకురావడంలో సహకారం అందిచడానికి తనదైన ప్రయత్నం చేసాడు..

కానీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొని మహాకూటమి పేరుతో తెలంగాణ ఎన్నికలలో రాజకీయాలు షురూ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారో, ఆర్కే కొత్త పలుకులలో కూడా గతం కంటే బిన్నంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి పూనుకున్నారు. ఇక పోలింగుకి ఒక వారం ముందు నుంచి తన ఛానల్ స్వరం పూర్తిగా మార్చివేసి టీఆర్ఎస్ పార్టీపై లేనిపోనీ అబాండాలు వేసి ఎంత మేర బద్నామ్ చేయాలో అంత మేర చేయడానికి తనంతు కృషి చేసాడు.

కేసీఆర్ తో రాజీకి వచ్చిన తరువాత తన ఛానల్ కు సంబంధించి అప్పనంగా స్థలాన్ని బారి మొత్తంలో దొబ్బేసిన ఆర్కే కు ఆ కృతజ్ఞత కూడా లేకుండా టీఆర్ఎస్ పార్టీపై తన వక్రబుద్ధిని చూపిస్తూ కారు కింద నెల కదులుతుందని, వచ్చే ఎన్నికలలో కారు తుక్కు తుక్కే అంటూ తన బుద్ధిని చూపించడం మొదలు పెట్టాడు. ఇక తన రెండు నాల్కల ధోరణితో అవసరమైనప్పుడు కేసీఆర్ వెంట నడిచి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి లబ్ది చేకూర్చేలా మహాకూటమికి అండగా నిలవడంతో తెలంగాణ ప్రజలంతా నివ్వెరపోతున్నారు. ఇప్పటికే ఆర్కే కొత్త పలుకులను ఏపీ ప్రజలు చెత్త పలుకులుగా భావించి తిరస్కరిస్తుంటే, ఇక తెలంగాణ జనం కూడా ఇక నుంచి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకులను నమ్మే పరిస్థితి కనపడటం లేదు.