చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే సినిమా నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు కాపీ ఆరోపణలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రకంపనలు గురి చేస్తుంది. కొత్తగా ఇండస్ట్రీలో ఎదగాలనుకుంటున్న రైటర్ రాజేష్ అనే అతను ఈ కథను ముందుగా రిజిస్టర్ చేయించుకున్నాడు. కానీ ఈ కథతో ఇప్పుడు చిరంజీవి హీరోగా “ఆచార్య” అనే సినిమా తెరకెక్కించడంతో అతడు కోర్టు మెట్లెక్కాడు. ఈ వ్యవహారమంతా ఇలా నడుస్తుంటే ఇప్పుడు కాపీ మరక కొరటాల శివపై పడటంతో అతడు చాలా ఇబ్బందులకు గురవుతున్నాడట.

అసలు ఈ కథ రైటర్ రాజేష్ కు చెందిందని కొరటాల శివకు తెలియదట. కొరటాల డైరెక్షన్స్ టీమ్ లో ఉన్న అసిస్టెంట్ ఒకతను ఈ స్టోరీ లైన్ చెప్పడంతో దానిని కొరటాల డెవలప్ చేసినట్లు తెలుస్తుంది. అసలు ఇంతకు అతడికి ఈ కథ ఎలా తెలిసిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎవరైనా డైరెక్టర్స్ అసోసియేషన్ లో ఉండే వారు లేదా రైటర్స్ అసోసియేషన్ లో ఉండేవారి ద్వారా ఈ కథ తెలుసుకొని కొరటాల శివకు చెప్పడంతో మనోడే కదా కథ చెప్పిందని గుడ్డిగా ఆ కథపై వర్క్ స్టార్ చేస్తే ఇప్పుడు తిరిగి తిరిగి మెడకు చుట్టుకుందా అనే ఆరోపణలు ఫిల్మ్ సర్కిల్ లో గుసగుసలాడుకుంటున్నారు. కానీ కొద్ది సేపటి క్రితం మైత్రి మూవీస్ సంస్థ మాత్రం “ఆచార్య” సినిమా ఎక్కడ నుంచి కాపీ కొట్టింది కాదని, తమ సొంత కథను ఒకరి కథ కాపీ కొట్టాల్సిన అవసరం లేదని చెప్పుకొస్తున్నారు.

బ్యాటరీతో నడిచే మాస్క్, ఇదేదో బలే ఉందే

పోలీసుల కంట పడకుండా రూటు మార్చుతున్న పేకాట రాయుళ్లు

బాహ్య ప్రపంచానికి దూరంగా బతికే 53 మంది ఆదివాసీలలో నలుగురికి కరోనా

10 రూపాయల కోసం ఆలోచిస్తే, రెండు లక్షల రూపాయలు చిల్లుపడింది