మాస్ హీరో విశాల్ నటిస్తున్న తాజా సినిమా ‘యాక్షన్’. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సి. సుందర్ దర్శకత్వం వహించాడు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కతుంది. టెర్రరిజం పై ఓ అధికారి చేసే పోరాటమే ఈ సినిమాగా ఉండబోతుంది. ఇక ఈ సినిమాలో తమన్నా అండర్ కవర్ కాప్ పాత్రలో నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్ కి, ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. ఇక శనివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను నిర్వహిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ లో దసపల్లా కన్వర్షన్ హాల్లో ఈ కార్యక్రమం శనివారం సాయంత్రం జరగబోతుంది. ఇక నవంబర్ 15న తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.