ప్రవేటు స్కూళ్ల దోపిడీపై తన పోరాటం కొనసాగుతుందని నటుడు శివబాలాజీ స్వష్టం చేశారు. కార్పొరేట్, ప్రవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఆన్లైన్ క్లాసుల పేరుతో భారీగా పీజులు వసూలు చేస్తున్నాయని.. రంగారెడ్డి జిల్లా డిఇవో కు పిర్యాదు చేశారు. హైదరాబాద్ లోని మణికొండ మౌంట్ లీటేరాజీ స్కూల్ తమ పిల్లలను ఎలాంటి సమాచారం లేకుండా ఆన్లైన్ క్లాసుల నుండి తొలగించిందని.. గతంలోనే హెచ్ఆర్సికి శివబాలాజీ పిర్యాదు చేశారు.

స్కూల్ పీజులను అన్యాయంగా పెంచారని.. తగ్గించాలని కోరితే ఎలాంటి సమాచారం లేకుండా ఆన్లైన్ క్లాసుల నుండి తమ పిల్లలను తొలగించారని చెప్పారు. తమ లాగానే అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రుల కూడా ఇబ్బందికి గురవుతున్నారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం జరగకపోతే స్కూల్ లైసెన్స్ రద్దయ్యేవరకు పోరాడతామని శివబాలాజీ స్వష్టం చేశారు.

శర్వానంద్ మూవీ కూడా ఓటిటి బాటలోనే..!

చంద్రబాబు చేసిన పనికి చిరంజీవి అప్పట్లో కన్నీటిపర్యంతమయ్యాడట