కరోనా మహమ్మారి మరో నటుడిని బలి తీసుకుంది. ప్రముఖ సినీ, టీవీ నటుడు కోసూరి వేణుగోపాల్ కరోనాతో మృతి చెందారు. ఆయనకు 22 రోజుల కిందట కరోనా సోకగా, హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆరోగ్యం క్షీణించడంతో కన్నుమూశారు.

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన వేణుగోపాల్.. ఎఫ్‌సీఐలో మేనేజర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఒకపక్క ఉద్యోగం చేస్తూనే సినిమాలలో నటించేవారు. పిల్ల జమిందార్, విక్రమార్కుడు, మర్యాదరామన్న, చలో తదితర చిత్రాలతో పాటు టీవీ సీరియళ్లలోను నటించారు. ఇక వేణుగోపాల్ మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బంతి వ్యక్తం చేశారు.

భారీ ఫీచర్లతో తక్కువ ధరలో ‘పోకో ఎక్స్ 3’..!