హీరోయిన్ మీరా చోప్రా తండ్రిని కొందరు దుండగులు కత్తులతో బెదిరించి ఫోన్ ఎత్తుకు పోయారని ఆమె తెలియచేసింది. ఈ విషయాన్నీ మీరా చోప్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఉదయం తన తండ్రి వాకింగ్ కి వెళ్ళినప్పుడు ఇద్దరు దుండగులు కత్తులతో బెదిరించి ఫోన్ ఎత్తుకు పోయారని తెలిపింది. ఢిల్లీలోని పోలీస్ కాలనీలో ఈ ఘటన జరిగినట్లు ఆమె తెలియచేసింది. సురక్షిత ప్రాంతమైన ఢిల్లీలోనే ఇలాంటి ఘటన జరగడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఇక ఢిల్లోలోని పీసీఆర్‌ పోలీస్‌ లేన్‌, మోడల్‌ టౌన్‌కు సమీపంలోని ప్రిన్స్‌ రోడ్డులో ఈ ఘటన జరిగిందని చెప్పిన మీరా చోప్రా.. ఈ విషయాన్నీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు, ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు తన ట్వీట్ ను ట్యాగ్ చేసింది.  ఇక మీరా చోప్రా చేసిన ట్వీట్ పై ఉత్తర ఢిల్లీ డీసీపీ స్పందించారు. ఈ పిర్యాదు ఆధారంగా పోలీస్ కేసు నమోదు చేసి దర్యాధు చేస్తున్నామని తెలియచేసారు. ఇక దీంతో వెంటనే పోలీసులకు ధన్యవాదములు తెలియచేసింది మీరా చోప్రా. ఇక మీరా చోప్రా గతంలో బంగారం, వాన, గ్రీకువీరుడు, మారో వంటి సినిమాలలో నటించింది.

కిమ్ జోంగ్ అలా నటించడానికి బలమైన కారణం ఏంటో తెలుసా..!

హైదరాబాద్ లో మద్యం కోసం క్యూ కట్టిన అమ్మాయిలు.. సోషల్ మీడియాలో వైరల్..!