ఆదిత్యహృదయం రామాయణంలోని యుద్ధకాండలో ఒక స్తోత్రం. ఈ స్తోత్రాన్ని మొట్టమొదట అగస్త్య మహర్షి రామరావణ యుద్ధసమయంలో రావణునిపై జయం పొందటానికి రామునికి ఉపదేశించటం జరిగింది. ఆదిత్య హృదయ పారాయణ వలనే రామునికి శత్రుజయం ప్రాప్తించింది. మన నిత్యజీవితంలో కూడా వృత్తి పరంగా కాని, మన పరిసరప్రాంతాలలో కానీ ఎవరోఒకరు మన పనికి అడ్డు తగులుతూ ఉంటారు.

ఎలాంటి అడ్డుతగలకుండా శత్రువినాశనం లేకుండా మన కార్యాలు జరగాలంటే ఆదిత్య హృదయం రోజూ పారాయణ చేయాలి. కేవలం మన బయటి శత్రువులకే కాకుండా మన అంతః శత్రువినాశానికి అనగా కామ, క్రోధ నివారణాలకి కూడా ఆదిత్య హృదయం ఉపయోగపడుతుంది. మన ఆరోగ్యపరమైన ఉపశమనానికి కూడా ఈ స్తోత్ర పారాయణ చేయవచ్చు. ఇది సూర్యునికి సంబంధించినది కావున ఆ భాస్కరుని కృప కూడా మనపై ఉంటుంది. మన సంకల్పం ధర్మబద్ధమై ఉండి మనం ఏ పని తలపెట్టినా అది సిద్ధిస్తుంది.

దసరా అనే పేరు ఎలా వచ్చింది, పండుగ చరిత్ర

బతుకమ్మ పేరు ఎలా వచ్చింది, పండుగ చరిత్ర