దాదాపు రెండు నెలలు తరువాత ఓ చిత్ర యూనిట్ ఇండియాకు చేరుకుంది. ‘ఆడు జీవితం’ చిత్ర యూనిట్ లాక్ డౌన్ కు ముందు షూటింగ్ చేయడానికి జోర్డాన్ కి వెళ్ళింది. ఈ సినిమాలో పృద్విరాజ్ హీరోగా నటిస్తున్నారు. కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను విధించిన సంగతి తెలిసిందే. ఇక 56 సభ్యులతో జోర్డాన్ కి వెళ్లిన చిత్ర యూనిట్ లాక్ డౌన్ కారణంగా అక్కడే ఉండిపోవలసి వచ్చింది.

అయితే తాము అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమ చిత్ర యూనిట్ ను ఎలాగైనా ఇండియాకు రప్పించాలని కేరళ ప్రభుత్వానికి పృద్విరాజ్ తెలియచేసాడు. ఇక ఎట్టకేలకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం వారిని ప్రత్యేక ఎయిరిండియా విమానాల్లో కేరళకు తీసుకువచ్చింది. దీంతో చిత్ర యూనిట్ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఏపీ మంత్రి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగబాబు

కరోనాపై గూగుల్, యాపిల్ సంయుక్తంగా సరికొత్త టెక్నాలజీ