ప్రేమకు వయస్సు పనిలేదని ఇప్పటికే అనేక సందర్భాలలో నిరూపితమైంది కూడా. అందులో భాగంగా వయస్సుతో నిమ్మితం లేకుండా అనేక చోట్ల రకరకాలా పెళ్లిళ్లు జరుగుతూనే ఉంటాయి. ఇక సోషల్ మీడియా యుగం వచ్చిన తరువత ముక్కు ముఖం తెలియని వారు చెప్పే మాటలకు నమ్మి మోసపోతున్న సంఘటనలు మరింత ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి. కర్నూల్ కు చెందిన 19 ఏళ్ళ యువకుడు డిగ్రీ చదవుతూ పేస్ బుక్ లో వరంగల్ కు చెందిన 26 ఏళ్ళ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు.

ఆ యువకుడు చెప్పిన మాటలు గోరువెచ్చగా ఉండటంతో ఆ యువతి అతడు చెప్పిన మాటలను నమ్మి అతడిని పెళ్లి చేసుకోవడానికి నిచ్ఛయించుకుంది. దీనితో హైదరాబాద్ కూకట్ పల్లిలో ఉండే ఆ యువతి దగ్గరకు ఆ యువకుడు కర్నూల్ నుంచి రావడం ఇద్దరు కలసి గుడిలో పెళ్లి చేసుకోవడం తంతు అంతా చకచకా ముగిసిపోయింది. ఇక పెళ్లి చేసుకున్న అంతరం ఆ యువకుడు తాను ఒకసారి కర్నూల్ తమ ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.

ఇక వెళ్లిన కుర్రాడు ఎంతకు రాకపోవడంతో అతడు తనను మోసం చేసాడని గ్రహించి ఆ యువతీ కర్నూల్ లోని అతడి ఇంటి వద్దకు మహిళా సంఘాలతో వెళ్లి ధర్నాకు కూర్చుంది. ఇది ఆ నోటా ఈ నోటితో పెద్ద వైరల్ గా మారింది. డిగ్రీ చదివే 19 ఏళ్ళ కుర్రాడిని ముగ్గులోకి దింపి మోసం చేసి పెళ్లి చేసుకుందని కొంతమంది అంటే, 19 ఏళ్లకే అమ్మాయిలను మోసగించే స్థాయికి దిగజారడాని మరికొంత మంది ఎవరకి తోచినట్లు వారు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ గడప తొక్కినట్లు తెలుస్తుంది.

పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక కరోనా సోకిందని నాటకం, బిత్తరపోయిన కుటుంబసభ్యులు