అల్లు అరవింద్ మరొక ఇద్దరు పార్టనర్స్ తో కలసి ఎంతో ఆర్బాటంగా ‘ఆహా’ అనే OTTని లాంచ్ చేశారు. కానీ అందులో కంటెంట్ మాత్రం మొత్తం యూట్యూబ్ లో ఉండే సినిమాలు తప్ప అంత గొప్పగా ఆకట్టుకునేవైతే ఏమి లేవు. ‘ఆహా” పెట్టిన కొత్తలో “అర్జున్ సురవరం, ఖైదీ” సినిమాలను అయితే కొనుగోలు చేశారు. అంతకన్నా గొప్ప సినిమాలైతే అందులో లేవు. పక్కా తెలుగు OTTగా విజయ దేవరకొండతో హడావిడి చేయించగా మొదట్లో “ఆహా” తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కానీ ఆ తరువాత అందులో సరైన కంటెంట్ లేకపోవడంతో రోజు రోజుకి వీక్షకుల సంఖ్య దిగజారిపోతున్నట్లు తెలుస్తుంది.

కొన్ని వెబ్ సీరియస్ ల వైపు దృష్టి పెట్టినా అవి కూడా ప్లాప్ టాక్ మూటకట్టుకోవడంతో ఇప్పుడు అల్లు అరవింద్ కాస్త గందరగోళ పరిస్థితులలో ఉన్నట్లు తెలుస్తుంది. ‘ఆహా’ ఫ్లాట్ ఫార్మ్ ను ముందుకు తీసుకొని వెళ్లాలా ఇంతటితో ముగించాలా అనే డైలమాలో ఉన్నారట. లాక్ డౌన్ సమయంలో ఎంతో అద్భుతంగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మంచి సినిమాలను చేజిక్కించుకోవడంలో కూడా “ఆహా” దారుణంగా విఫలమైంది.

అల్లు అరవింద్ నిర్మాతగా సూపర్ సక్సెస్ అయినా OTT ఫ్లాట్ ఫార్మ్ లోకి వచ్చి చేతులు కాల్చుకున్నాడని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. అల్లు అరవింద్ ను చూసి చాలా మంది నిర్మాతలు OTT రంగంలోకి అడుగుపెట్టాలని చూశారు. హీరో మహేష్ బాబు సైతం OTT వైపు ఒకానొక సమయంలో దృష్టి సారించారు. ఇలాంటి వారికి ‘ఆహా’ OTT ఒక పాఠంలో గుర్తుండిపోతుంది. ప్రస్తుతం ‘ఆహా’ ఫ్లాట్ ఫార్మ్ నుంచి “మెట్రో కథలు” సినిమా విడుదల కానుంది. దీనిపై కొద్దిగా ఆశలు పెట్టుకున్నారట. ఇది కూడా ఫెయిల్ అయితే “ఆహా”కథ ముగిసినట్లే అని గుసగుసలాడుకుంటున్నారు.

“పెద్దలకు మాత్రమే”షోపై యాంకర్ ఝాన్సీ మరింత క్లారిటీ