ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో చోటు చేసుకుంది. ఓ విమానం అత్యవసర పరిస్థితులలో హైవేపై దిగింది. విమానం టేకాఫ్ అయిన కొద్దీ సేపటికే ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఘజియాబాద్ హైవేపై ఎమర్జెన్సీ లాండింగ్ అయ్యింది. పైలెట్లకు శిక్షణ ఇచ్చే ఎన్సీసీకి చెందిన ట్రైనింగ్ విమానం గాలిలోకి ఎగరగానే సాంకేతిక లోపం తలెత్తడంతో వెంటనే హైవేపై దింపారు. ఈ ఘటనలో ఫ్లైట్ రెక్క విరిగిపోయింది. పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •