ఈమధ్య ఎయిర్ టెల్ సంస్థ జియోపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించి అసలు కారణం ఏమిటంటే మనం ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు అతడిది వేరే నెట్వర్క్ సిమ్ అయితే… ఫోన్ లిఫ్ట్ చేసిన నెట్వర్క్ సంస్థకు మీరు వాడే నెట్వర్క్ సంస్థ కొంత డబ్బులు చెల్లించవలసి ఉంటుంది. దీనిపై ఈమధ్య జియో ఏమి చేసిందంటే గతంలో మనం ఇతరులకు ఫోన్ చేస్తే దాదాపుగా 35 సెకెన్ల పాటు రింగ్ అవుతుంది.

ఆ రింగ్ సమయాన్ని 25 నిమిషాలకు కుదించింది. ఇలా కుదించడం వలన మీరు అవతల వ్యక్తికి ఫోన్ చేసినప్పుడు అతడు సరైన సమయంలో కాల్ లిఫ్ట్ చేయకపోతే రింగ్ కట్ అవుతుంది. అప్పుడు అతడు మీకు తిరిగి కాల్ చేస్తాడు. దీని వలన తిరిగి కాల్ చేసిన నెట్వర్క్ అతడు డబ్బులు చెల్లించవలసి ఉంటుంది. దీని వలన ఎయిర్ టెల్ కు బారి లాస్ వస్తుందట.

దీనిపై ట్రాయ్ కు కంప్లైన్ట్ చేసింది. ఇక ఇప్పుడు జియో ఆడుతున్న గేమ్ ను ఎయిర్ టెల్ కూడా మొదలుపెట్టి తన ఫోన్ నుంచి వెళ్లే రింగ్ ను కూడా 35 సెకెన్ల నుంచి 25 సెకన్లకు తగ్గించింది. ఇదే దారిలో వోడాఫోన్ ఐడియా కూడా పయనించనున్నట్లు తెలుస్తుంది. దీనితో ఇంటర్ కనెక్టివిటీ యూసేజ్ చార్జీలను తప్పించుకోవాలని అందరూ ప్రయత్నిస్తున్నారు.