నాని, సుదీర్ బాబు నటిస్తున్న తాజా సినిమా ‘వి’. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నివేద థామస్, అదితి రావు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా సుదీర్ బాబు నటిస్తుండగా, ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో నాని నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాలో విడుదలైన పోస్టర్లు సినిమాపై హైప్ ను పెంచగా.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ టీజర్ లో నాని, సుదీర్ బాబు ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కాబోతుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •