ఈనెల 15న అఖిల్ కొత్త సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి సిద్ధమవుతుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అఖిల్ కు ఎంతో ప్రతిష్టాత్మకమైంది. ఇప్పటికే అఖిల్ చేసిన మూడు సినిమాలు “అఖిల్. హలో, మిస్టర్ మజ్ను” సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో తన రాబోయే సినిమాపై ఫోకస్ పెట్టాడు.

అందులో భాగంగానే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొని వచ్చాడు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నడిచి వెళ్లి తన కోర్కెలు నెరవేరాలని కోరుకున్నాడట. శ్రీవారి దర్శనం తరువాత తన కొత్త సినిమా మొదలవుతుందని చెప్పాడు. సమంత ఈ మధ్య తన భర్త చైతన్య నటిస్తున్న సినిమాల విడుదలకు ముందు తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. 

గత వారం సమంత నటించిన “ఓ బేబీ” సినిమా విడుదలకు ముందు కూడా నడకమార్గంలో వెళ్లి శ్రీవారిని దర్శించుకొని రావడం… ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో అఖిల్ కూడా సమంత దారిలో నడుస్తున్నాడా అనిపిస్తుంది. తిరుమల వెంకటేశ్వరుడైన ఈసారి అఖిల్ సినిమాను కరుణిస్తాడో లేదో చూడాలి. ఈ సినిమాకు హీరోయిన్ గా నివేత పేతురాజ్ ను అనుకుంటున్నారు. రీసెంట్ గా విడుదలైన “బ్రోచేవాడెవడురా” సినిమాలో ఈ అమ్మాయి నటించింది.