అక్కినేని అఖిల్ నటించిన మూడు సినిమాలు ఆశించిన విజయం సాధించకపోవడంతో అభిమానులు నిరాశగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో చాలా మంది హీరోయిన్స్ పేర్లను పరిశీలించి చివరకు పూజా హెగ్డే ను తీసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి పూజా హెగ్డే తప్పుకుందట. వరుస సినిమాలతో బిజీగా ఉన్న పూజా.. ఈ సినిమాకి డేట్స్ కుదరక తప్పుకుందట. దీనితో నిర్మాతలు మరో హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డారు.

ఇక ఈ సినిమాలో బలమైన ఫ్యామిలి ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ఉంటుందట. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు.

  •  
  •  
  •  
  •  
  •  
  •