అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలయింది. ఇంకా సినిమాకు సంబంధించి అఖిల్ కు జోడిగా ఎవరిని సెలక్ట్ చేయాలా అని దర్శక, నిర్మాతలు కింద మీద పడుతున్నారు. ఇక ఫైనల్ గా రష్మిక మందన్నాను సెలెక్ట్ చేసి అఖిల్ వద్దకు వెళితే మరొక టాప్ హీరోయిన్ ను సెలెక్ట్ చేయమని చెప్పాడట.

అఖిల్ చెప్పిన ఆ హీరోయిన్ పూజ హెగ్డే అని తెలుస్తుంది. పూజ హెగ్డే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో పాపులర్ హీరోయిన్ కావడంతో పాటు, సినిమాకు బాగా హెల్ప్ అవుతుందని బావిస్తున్నారట. అందుకే పూజ హేగ్దే వైపు అఖిల్ మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. కానీ పూజ హేగ్దే ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటిస్తుంది. ఇంకా మరికొన్ని కమిట్మెంట్స్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. పూజ హేగ్దే కనుక డేట్స్ సెట్ చేసుకొని షూటింగ్ కు రెడీ అయితే పూజ హేగ్దే అఖిల్ పక్కన నటించడం పక్కా అయినట్లే. కానీ అఖిల్ పక్కన పూజ హేగ్దే అంటే కొంచెం ఆలోచించవలసిన విషయమే. అఖిల్ కాస్త నూనూగు మీసాలతో పూజ హేగ్దే పక్కన కాస్త చిన్న పిల్లోడిలా ఉంటాడన్న రూమర్స్ ఉన్నా… అఖిల్ మాత్రం పూజ హేగ్దే వైపే మొగ్గు చూపుతున్నాడట. 

 
  •  
  •  
  •  
  •  
  •  
  •