అక్కినేని అభిమానులకు నవంబర్ 23న పెద్ద పండగ అని చెప్పవచ్చు. ప్రస్తుతం నాగ చైతన్య ‘వెంకీమామ’, శేఖర్ కమ్ముల సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 23న చైతు బర్త్ డే కావడంతో ఆ రోజున ‘వెంకిమామ’ లోని చైతు క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ ఓ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలియచేసింది. ఆ సినిమాలో చైతు.. కెప్టెన్ కార్తిక్ పాత్రలో అదరగొట్టాడని అంటున్నారు.

ఇక నాగ చైతన్య.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తన 19వ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పాత్రను నవంబర్ 23 ఉదయం 10:30 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమాకు ‘లవ్ స్టోరీ’ అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇలా చైతు ఒకే రోజు రెండు డిఫరెంట్ సినిమా టీజర్ లతో రావడంతో అక్కినేని అభిమానులకు పెద్ద పండగగా చెప్పవచ్చు.