2014 ఎన్నికలలో తెలుగుదేశం – బీజేపీపొత్తులో భాగంగా రాజమండ్రి అర్బన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించి ఆకుల సత్యనారాయణ, ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ పార్టీకి రాజీనామా చేసారు తన రాజీనామాను నేరుగా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు పంపినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆకుల సత్యనారాయణ భార్య జనసేన పార్టీలో చురుకుగా పాల్గొంటున్నారు.

ఇదే క్రమంలో  ఆకుల సత్యనారాయణ కూడా తన రాజీనామా ఆమోదం తరువాత జనసేన పార్టీలో చేరి రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేయాలని అభిలషిస్తున్నారు. గత ఎన్నికలలో బీజేపీ పార్టీ నుంచి గెలిచిన కామినేని శ్రీనివాస్, విష్ణు కుమార్ రాజు కూడా పక్క చూపులు చూస్తున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కామినేని శ్రీనివాస్ తెలుగుదేశం – బీజేపీ అలియాన్స్ లో భాగంగా మంత్రి పదవిని కూడా చేపట్టారు. ఆ తరువాత రెండు పార్టీలు వేరు కుంపటి పెట్టిన దగ్గర నుంచి బీజేపీ పార్టీతో ఆంటీ ముట్టనట్లు ఉంటూ ఒకటి, రెండు సార్లు అమరావతిలో చంద్రబాబుని కూడా కలిసి వచ్చారు.

వచ్చే ఎన్నికలలో బీజేపీ పార్టీ తరుపున పోటీ చేస్తే డిఫాజిట్స్ కూడా వచ్చే అవకాశం లేదని ముందుగానే పక్క పార్టీల వైపు  చూడటానికి ఎమ్మెల్యేలు ఆసక్తి కనపరుస్తున్నారు. ఇక బీజేపీ పార్టీలో మిగిలిన మరో ఎమ్మెల్యే మాణిక్యాలరావు మాత్రం అదే పార్టీలో కొనసాగటానికి ఇష్టపడుతున్నారు.
  •  
  •  
  •  
  •  
  •  
  •