అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న ‘అల వైకుంఠపురంలో’ సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తుంది. ఈమధ్యే రాజమండ్రిలో లాంగ్ షెడ్యూల్ ముగించుకొని చిత్ర యూనిట్ హైదరాబాద్ వచ్చేసింది. త్వరలో ఫారిన్ టూర్ కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజ హేగ్దే నటిస్తుంది. ఈ సినిమాను వచ్చే 2020 జనవరి 12వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారట.

జనవరి 12వ తేదీ ఆదివారం కావడం గమనార్హం. మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాను జనవరి 10వ తేదీ విడుదల చేయనున్నారు. అంటే మహేష్ బాబు సినిమా తరువాత రెండు రోజులకు ‘అల వైకుంఠపురంలో’ సినిమా విడుదల కానుంది. సంక్రాంతి సీజన్ లో సినిమాలకు మంచి డిమాండ్ ఉండటంతో మేకర్స్ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు.

సంక్రాంతి సీజన్ లో కనుక సినిమాను మిస్ చేసుకుంటే మంచి డేట్ దొరకడానికి సమ్మర్ వరకు వెయిట్ చేయవలసి ఉంది. ఇక ఈరెండు బారీ బడ్జెట్ తో రూపొందనుండటంతో ఏ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంటుందో చూడాలి. వీరితో పాటు బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా, రజనీకాంత్ హీరోగా మరొక సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉండనున్నాయని తెలుస్తుంది. ఆ సినిమాలకు సంబంధించి ఇంకా డేట్స్ ఖరారు కాలేదు. చూద్దాం ఏ సినిమా మంచి టాక్ తో సంక్రాంతి సీజన్ ను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటుందో.