అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురములో’. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో టబు ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు భారీ స్పందన వచ్చిన నేపధ్యలో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.

ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయి. ప్రముఖ ఆన్లైన్ స్ట్రీమింగ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా రైట్స్ ను భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేశారట. అందుకు సంబంధించిన డీల్స్ మొత్తం పూర్తయ్యాయని సమాచారం. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాల తర్వాత అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది.