తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ కమెడియన్స్ లో ఆలీ ముందు వరుసలో ఉంటాడనేది అతిశయోక్తి కాదు. గతంలో తెలుగుదేశం పార్టీలో యాక్టీవ్ రోల్ పోషించిన ఆలీ, ఇప్పుడు మరోసారి రాజకీయాలలో తన సత్త చాటాలని ఆసక్తి చూపిస్తున్నాడు. ఇందులో భాగంగానే గత వారం వైఎస్ జగన్ ను కలసినప్పుడు అందరూ ఆలీ వచ్చే ఎన్నికలలో వైసిపి తరుపున పోటీ చేయబోతున్నాడనుకున్నారు. కానీ నిన్న హఠాత్తుగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడంతో ఒక్కసారిగా వైసిపి కార్యకర్తలకు షాక్ ఇచ్చాడు.

మొదటగా ఆలీ వైసిపిలో చేరి ఎమ్మెల్యే పదవిని సాధించి, అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి పదవి కావాలని కళలు కన్నట్లు తెలుస్తుంది. కానీ వైసిపి నాయకత్వం ఎమ్మెల్యే పదవి వరకు అయితే హామీ ఇవ్వడంతో… ఆలీ తనకు తెలిసిన రాజకీయాన్ని షురూ చేయడానికి నిన్న ఉదయం చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ ను కూడా కలిసాడు. దీనితో వైసిపి పెద్దలు దిగి వచ్చి ఆలీ కోరుకున్న సీటుతో పాటు, మంత్రి పదవి కూడా ఇస్తారని భావించి ఉండవచ్చు.

గత వారం రోజులుగా ప్రముఖ మీడియాలో ఆలీ ఈనెల 9న వైఎస్ జగన్ నేతృత్వంలో వైసిపిలో చేరబోతున్నాడని కథనాలు కూడా వచ్చాయి. దీనిపై ఆలీ గత రాత్రి ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఎవరి ఊహాగానాలు వారికి ఉంటాయని. నేను వైసిపిలో చేరవచ్చు లేదా చేరకుండా ఉండవచ్చు అని చెబుతూ మరికొంత కన్ఫ్యూషన్ లోకి నెట్టాడు. అంటే ఆలీ అన్ని పార్టీల అధినేతల దగ్గరకు వెళ్లి తనకు పలానా పదవి ఇస్తానని చెబితే మీ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతూ బెదిరించే ధోరణిలో ముందుకు వెళ్తున్నాడు అనుకోవాలి. కానీ తెలుగుదేశం పార్టీ, వైసిపి పార్టీలో సీనియర్ ముస్లిం నేతలను వదిలి పెట్టి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయని ఆలీకి వారు అధికారంలోకి వస్తే ఏకంగా మంత్రి పదవి కట్టబెట్టే పరిస్థితి అయితే కనపడటం లేదు. తాను యాక్టర్ ను అని అదే తనకు ఉన్న గొప్పతనమని చెబుతున్న ఆలీ చివరకు ఏపార్టీలో చేరుతాడో సంక్రాంతి పండుగ ముందే ఒక క్లారిటీ రానుంది.