బిగ్ బాస్ తెలుగు 3 నాగార్జున పుట్టినరోజు సంబరాలు పూర్తి చేసుకుకొని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక నాగార్జున ఎంట్రీతో పాటు బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం బాటకు వెళ్లే వ్యక్తి ఎవరో క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే ఆలీ రెజా బయటకు వచ్చేసాడట, ఆ ఎపిసోడ్ మనకు ఈరోజు సాయంత్రం 9 గంటలకు ప్రసారం అవుతుంది. ఆలీ రేజాకు గత వారం తక్కువ ఓట్లు పడ్డాయని, ఈ వారం కచ్చితంగా వస్తాడని నిన్న మనం చెప్పుకున్నట్లు ఈరోజు బయటకు సాగనంపారు.

ఆలీ రేజా హౌస్ లో తన దురుసుతనంతో తనకు తానే కొని తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ లో హౌస్ మేట్స్ తో పాటు, బయట ప్రేక్షకులకు కూడా ఆలీ రెజా ప్రవర్తన నచ్చకపోవడంతో ప్రేక్షకులు సాగనంపారు. బిగ్ బాస్ మొదలై ఆరు వారాలు గడుస్తున్నా ఇంత వరకు ఆలీ రెజా నామినేషన్ ప్రక్రియలోకి రాలేదు. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన యాంకర్ శిల్ప చక్రవర్తికి నామినేషన్ ప్రక్రియ అప్పగించగా… ఇంతవరకు నామినేషన్ ప్రక్రియ పేస్ చేయని కారణంగా ఆలీ రేజాను ఎంపిక చేస్తున్నట్లు తెలియచేసింది.

ఇక ఆలీ రెజా కూడా ఇంత వరకు నామినేషన్ ప్రక్రియ లేకపోవడంతో పాటు, ఇప్పుడు కొత్తగా నామినేషన్ లోకి రావడంతో తనకు వెల్లువలా ఓట్లు పడతాయని భావించి ఉంటాడు. కానీ అతని ప్రవర్తనపై బయట ఎంత నెగటివ్ ఉందో గుర్తించి ఉండడు. ఇలానే బిగ్ బాస్ సీజన్ 1 కూడా ‘ప్రిన్స్’ అనే హీరో ఉండేవాడు. అప్పటి వరకు హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగి ఎప్పుడైతే మొదటి సారి నామినేషన్ ప్రక్రియని ఎదుర్కొన్నాడో ఆ వారమే ప్రేక్షకులు ఎత్తి బయటపడేశారు. ఈరోజు సాయంత్రం ప్రసారమయ్యే ఎపిసోడ్ తో
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి ఆలీ రెజా బయటకు వచ్చాడో మరెవరైనా వచ్చారో చూద్దాం.

  •  
  •  
  •  
  •  
  •  
  •