ఆదివారం వచ్చిందంటే చాలు బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఉదయం నుంచే సోషల్ మీడియాలో ఒకటే చర్చ కొనసాగుతుంది. ఇక ఈ చర్చలో భాగంగా ముందుగానే ఆలీ రెజా ఈవారం ఎలిమినేట్ అవుతాడని అందరూ ఊహించినట్లు ఎలిమినేట్ అవ్వడంతో ఒక్కసారిగా శివ జ్యోతి అలియాస్ సావిత్రక్క షాక్ కు గురై బోరున ఏడ్చేసింది, మరోవైపున శ్రీముఖి కూడా తన కన్నీటితో వీడ్కోలు పలికింది. ఆలీ రెజా మాత్రం తాను వెళ్లిపోతుంటే ఇంతమంది ఏడుస్తునందుకు టైటిల్ గెలిచినంత ఆనందంగా ఉందని అన్నాడు. 

ఇక ఎలిమినేషన్ తరువాత బయటకు వచ్చిన ఆలీ రెజాతో నాగార్జున హౌస్ మేట్స్ తో పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడించాడు. ఏడవొద్దని స్ట్రాంగ్ గా నీ గేమ్ ఆడమని శివజ్యోతికి సూచిస్తే, బాబా భాస్కర్ ను చూస్తూ ఉండిపో అని మహేష్ కు, ఫైనల్ వరకు ఉంటావని శ్రీముఖికి, కొంచెం చూస్తూ మాట్లాడని రాహుల్ కు, జ్యోతిని కాస్త చూస్తూ ఉందని వితికకు, శివ జ్యోతిని సరిగ్గా చూసుకో అంటూ రవికి, అద్భుతంగా ఆడుతున్నావని ఇప్పుడు ఎలా ఆడుతున్నావో అలానే ఆడమని, ఫైనల్ లో కచ్చితంగా ఉంటావని వరుణ్ కు తెలియచేసాడు. 

ఇక ఈవారం బిగ్ బాస్ 2 హోస్ట్ నాని వచ్చి సందడి చేసాడు. వస్తూనే ‘నా నీ టీవీలో’ అంటూ ‘బిగ్ బాస్ 2’ తన సిగ్నేచర్ స్టైల్ లో అలరించాడు. ఇక ఈ వారం విడుదల కాబోతున్న తన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా గురించి హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ వారికి ట్రైలర్ చూపించడం జరిగింది. ఈ మూవీ లో నాని రైటర్ గా నటిస్తుండటంతో హౌస్ మేట్స్ కు సరిపోయే క్యారెక్టర్స్ ను సూచించాడు. నాగార్జున ఇచ్చిన కొన్ని ఇంగ్లీష్ మూవీ టైటిల్స్ ను తెలుగులో అనువాదం చేసి ఫన్ క్రియేట్ చేసేలా చేశాడు.

  •  
  •  
  •  
  •  
  •  
  •