బాలీవుడ్ యువ హీరో సుశాంత్ రాజ్ పుత్ చనిపోయిన తరువాత బాలీవుడ్ లో అలియా భట్ కెరీర్ సందిగ్ధంలో పడింది. ఈమధ్య అలియా నటించిన “సడక్ 2” సినిమాకు కోటికి పైగా డిస్ లైక్స్ రావడంతో యావత్ దేశమంతా ఈ సినిమా గురించే చర్చించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా దాదాపుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” సినిమాలో అలియా భట్ ను తప్పించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.

అసలే సుశాంత్ కేసు ఇప్పుడు సీబీఐ గడప తొక్కింది, రాబోయే రోజులలో కేసులో ఎన్నో ట్వీస్ట్లు ఉనట్లు వ్యవహారం చూస్తుంటే తెలుస్తుంది. దీనితో అలియా భట్, మహేష్ భట్ పై ఆరోపణలు రావడంతో ఒకవేళ అలియాను కనుక సినిమాలో పెట్టుకుంటే “ఆర్ఆర్ఆర్” సినిమా మార్కెట్ భారీగా దెబ్బ పడే అవకాశం ఉండటంతో ఆమెను తప్పించి ఇప్పుడు ఆమె స్థానంలో మరొక అందాల సుందరి ప్రియాంక చోప్రాను తీసుకోవాలని చూస్తున్నారని వార్తలు సినీ సర్కిల్ లో జోరుగా నడుస్తున్నాయి.

కానీ ప్రియాంక చోప్రా హాలీవుడ్ పేరు చెప్పి రెమ్యునరేషన్ అధికంగా అడిగే ఛాన్స్ కూడా లేకపోలేదు. భారత్ మార్కెట్లో ప్రియాంక చోప్రాకు మర్కెట్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. కానీ ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” టీమ్ కు ప్రియాంక మాత్రమే కనిపిస్తుంది. కానీ మరొక హీరోయిన్ గురించి కూడా ఆరా తీస్తూ ఎవరు సెట్ కాకపోతే ప్రియాంక చోప్రాను ఫైనల్ చేసే అవకాశమునట్లు కనపడుతుంది. సినిమా షూటింగ్స్ కు అనుమతి లభించడంతో వచ్చే నెల చివర్లో “ఆర్ఆర్ఆర్” షూటింగ్ మొదలయ్యే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.

చైనాలో చిట్టి చిన్నారులకు అద్భుతమైన క్రీడా శిక్షణ

మాజీ మంత్రికి కరోనా పాజిటివ్.. హైదరాబాద్ కి తరలింపు..!

కిమ్ జాంగ్ చనిపోయాడు, జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు