అల్లు అర్జున్ కొత్త సినిమాకు ముహూర్తం ఖరారైంది. ‘ఆర్య’, ‘ఆర్య 2’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోతున్నాడు. ఈ చిత్రం అల్లు అర్జున్ కి 20 వ సినిమాగా తెరకెక్కుతుంది. అక్టోబర్ 3న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుకుమార్ ఓ అద్భుతమైన కథను సిద్ధం చేశారట. ఈ సినిమాలో నటించే హీరోయిన్, ఇంకా ముఖ్యమైన నటీనటులను త్వరలోనే ప్రకటిస్తారు.

ప్రస్తుతం అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘అల వైకుంఠపురంలో’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో వీరి కాంబినేషన్ లో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •