అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న #AA19 టైటిల్ స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించి టైటిల్ విషయంలో రోజుకొక న్యూస్ బయటకు రావడంతో ఎలాంటి టైటిల్ సినిమాకు పెడతారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు “నేను నాన్న, అలకనంద” అనే రెండు టైటిల్స్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కానీ ఇప్పుడు ఆ రెండు కాకుండా మరో కొత్త టైటిల్ పేరు వినపడుతుంది. త్రివిక్రమ్ ఈ సినిమా కోసం “వైకుంఠపురంలో” అనే టైటిల్ అనుకుంటున్నారట. ఈ టైటిల్ నే కచ్చితంగా ఫిక్స్ చేసే అవకాశం ఉందన్న వార్తలు వినపడుతున్నాయి. త్రివిక్రమ్ కూడా తన టైటిల్ విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటాడు. “వైకుంఠపురంలో” అనే టైటిల్ వినడానికి కూడా రీసౌండింగ్ గా ఉండటంతో ఆ టైటిల్ నే ఖరారు చేస్తారేమో… మరొక్క రెండు రోజులు ఆగితే తెలిసిపోతుంది. ఇక ఈ సినిమా ఇప్పటికే కాకినాడకు సంబంధించి షూటింగ్ శరవేగంగా నడుస్తుంది. అల్లు అర్జున్ సరసన పూజ హేగ్దే నటిస్తున్న ఈ సినిమా సంక్రాంత్రి కానుకగా విడుదల చేయాలని చూస్తున్నారట.

  •  
  •  
  •  
  •  
  •  
  •