‘లోఫర్’ సినిమాతో టాలీవుడ్ లో పరిచయమైంది దిశాపటాని. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా నిరాశపరిచింది ఆ తర్వాత దిశాపటానికి తెలుగులో అవకాశాలు రాలేదు. అయితే బాలీవుడ్లో మాత్రం మంచి సినిమాలు చేసి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు దిశాపటానికి అల్లు అర్జున సరసన నటించే అవకాశం వచ్చింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మించే సినిమాలో దిశా నటించబోతుంది. అల్లు అర్జున్ సరసన ఓ కొత్త హీరోయిన్ కోసం దిల్ రాజు వెతుకుతున్న సమయంలో అనుకోకుండా దిశాపటానిని ఫిక్స్ చేశారట. కాగా ఈ సినిమాకు ‘ఐకాన్’ అనే పేరు ఫిక్స్ చేశారు. ఈ సినిమా హిట్ అయితే దిశాకు టాలీవుడ్ లో మంచి ఛాన్సులు వస్తాయనడంలో సందేహం లేదు.

  •  
  •  
  •  
  •  
  •  
  •