“నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” సినిమా తేడకొట్టే సరికి అల్లు అర్జున్ దాదాపుగా ఎనిమిది నెలలుగా సినిమాలకు దూరంగా గడుపుతూ మంచి స్టోరీ లైన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటికే దరకుడు విక్రమ్ కుమార్ ను లైన్ లో పెట్టి, స్టోరీ నచ్చకపోవడంతో సైడ్ చేసాడు. ఇప్పుడు “అరవింద సమేత” సినిమాతో మరోసారి ప్రామిసింగ్ డైరెక్టర్ అనిపించుకున్న త్రివిక్రమ్ తో జత కట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

అల్లు అర్జున్ తన ప్రతి సినిమాలో లుక్స్ పరంగా వెరైటీని చూపిస్తూ అభిమానులు ఆకట్టుకుంటాడు. ఇక, ఈ ఆదివారం విజయ్ దేవరకొండ నటించిన “టాక్సీవాలా” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరై అభిమానులను ఆకట్టుకున్న అల్లు అర్జున్ తన ప్లాప్ సినిమా హెయిర్ స్టైల్ తో వచ్చి అభిమానులను షాక్ కు గురిచేశాడు. గతంలో అల్లు అర్జున్ ఇదే హెయిర్ స్టయిల్ తో ఆర్య2, వరుడు సినిమాలలో నటించాడు. ఆర్య2 పర్లేదు అనిపించుకున్నా, వరుడు సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. తన తదుపరి సినిమా కోసం మరోసారి ఇలాంటి లుక్ తో రాబోతున్నాడా అంటూ సోషల్ మీడియాలో అభిమానులు చర్చలు పెట్టారు.

టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండను ఆకాశానికి ఎత్తేసిన అల్లు అర్జున్ విజయ్ “రౌడీ” టీ షర్ట్ తనకు వేసుకోవాలని ఉందని చెబుతూ, నెక్స్ట్ సినిమా ఎప్పుడు అని అడిగిన అభిమానులకు ఇంకా నిర్ణయం తీసుకోలేదని త్వరలో చెప్తానని తెలియచేసాడు. త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ సినిమా దాదాపుగా ఒకే అయిందని, తన తదుపరి సినిమా లుక్ ఇదే విధముగా ఉంటుందా ఏమైనా మార్చే అవకాశాలు ఉన్నాయో త్వరలోనే తేలనుంది.