భారతీయ సినీ ఇండస్ట్రీలో ఒక అరుదైన రికార్డు తెలుగు ఫిల్మ్ స్టార్ అల్లు అర్జున్ నెలకొల్పి తన ఘనతను సొంతం చేసుకున్నాడు. అల్లు అర్జున్ హీరోగా 2016లో విడుదలైన “సరైనోడు” సినిమా ఇప్పుడు యుట్యూబ్ లో దాదాపుగా 300లకు పైగా వ్యూస్ సొంతం చేసుకున్న మొదటి సినిమాగా చరిత్ర సృష్టించింది. దీనికి సంబంధించి బాలీవుడ్ సినీ విశ్లేషకుడు కమల్ నాధ్ ట్విట్టర్ స్పందించాడు. ఇప్పటి వరకు ఏ భారతీయ చిత్రం ఇంతటి ఘనత సాధించలేదని తెలియచేసారు.

ఈ సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా అల్లు అర్జున్ హీరోగా ధనుష్ విలన్ పాత్రలో అదరగొట్టాడు. ఫక్తు మాస్ సినిమాగా తెలుగులో మంచి ఆదరణ పొందిన ఈ సినిమాను హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్ లో విడుదల చేశారు. మన తెలుగు యాక్షన్ సినిమాలను హిందీ ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందులో భాగంగా ఈ సినిమా అదిరిపోయే వ్యూస్ సొంతం చేసుకుంది. కొన్ని చిన్నతెలుగు సినిమాలు అయితే హిందీ డబ్బింగ్ పై ఆధారపడి సినిమాలు తీసే స్థాయిలో నిర్మాతలు ఉన్నారంటే మన సినిమాల పట్ల నార్త్ ప్రజల ఆసక్తి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ కు కూడా హిందీ మార్కెట్ లో మంచి క్రేజ్ ఉంది. అతడు చేసే సినిమాలు అన్ని మాస్ తో దుమ్ముదులపడంతో అతడి సినిమా కోసం హిందీ జనాలు ఎగబడుతుంటారు. ఇక్కడ బెల్లంకొండ సినిమాలు ప్లాప్ టాక్ మూటగట్టుకున్నా హిందీ రైట్స్ అమ్మేసి ఆ లాస్ కవర్ చేసుకుంటుంటారు. ఇలా మాస్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడే హిందీ ప్రేక్షకుల కోసం అల్లు అర్జున్ సాధించిన ఫీట్ తో రాబోయే రోజులలో మరికొన్ని సినిమాలు తీసి హిందీ ప్రేక్షకులను అలరిస్తారేమో చూడాలి.