గతంలో నటి అమలాపాల్, దర్శకుడు విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత మనస్పర్థలు కారణంగా కొంత కాలానికి వీరిద్దరూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విడాకుల విషయంపై ఘాటుగా స్పందించారు అమలాపాల్. ఇక విజయ్ తండ్రి ఏఎల్‌.అళగప్పన్‌ విజయ్ నుండి అమలాపాల్ విడిపోవడానికి, విడాకులు పొందడానికి హీరో ధనుషే కారణం అనే చెప్పాడు. ఆయన తాను నిర్మించిన ‘అమ్మ కణక్కు’ సినిమాలో నటించమని అమలాపాల్ ను కోరాడని.. అయితే పెళ్ళికి ముందు ఇక నటించనని చెప్పిన అమలా.. మళ్ళీ నటించడానికి సిద్ధమైందని.. అదే విజయ్ కి అమలాపాల్ కి విడాకులకు దారి తీసిందని వ్యాఖ్యలు చేసాడు.

ఇక ఈ విషయాన్ని అమలాపాల్ ను అడగగా ఘాటుగా సమాధానం చెప్పింది. మీ విడాకులకు ధనుషే కారణమనేది వాస్తవమా అని అడగగా.. ఈ ప్రశ్నకు బదులిచ్చిన ఆమె ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడెందుకు అడుగుతారని చెప్పింది. అయినా తన విడాకుల రద్దు గురించి చర్చ అనవసరమని చెప్పింది. ఇది తన వ్యక్తిగత విషయం అని.. విడాకులు తీసుకోవాలని పూర్తిగా తన నిర్ణయమేనని ఇతర వ్యక్తులకు అసలు సంభందం లేదని చెప్పింది.