నడుం నొప్పి సమస్య ఉన్నవారికి ఆ బాధ చాల తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఆ నడుం నొప్పి భరించడం చాల కష్టంగా ఉంటుంది. ఆయుర్వేద వైద్యములో నడుం నొప్పి ఉపశమనానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.

ప్రతి రోజూ పది చుక్కలు వెల్లుల్లి రసం పావు గ్లాసు గోరువెచ్చని పాలల్లో కలిపి తీసుకుంటే నడుం నొప్పి తగ్గుతుంది. అలాగే అల్లం రసం, పసుపు కలిపి పాలతో తీసుకుంటే జీర్ణ కోశం బాగుపడి నడుంనొప్పి తగ్గుతుంది. ఆవు నెయ్యి, నువ్వుల నూనె వేడి చేసి నడుముకు మర్దన చేసుకుని వేడి నీళ్ళతో స్నానం చేస్తే నడుం నొప్పి తగ్గుతుంది.

లావుగా ఉన్నవారికి నడుం నొప్పి వుంటే, పావు గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో ఇరవై చుక్కలు నిమ్మ రసం వేసి పరగడుపున ప్రతి రోజు త్రాగుతుంటే, శరీరం తేలికపడి ఉపశమనం కలుగుతుంది.

ఒక నిమ్మకాయ కోసి ఒక చెక్కను పల్చటి గుడ్డలో కట్టి, మూకుడులో ఆవు నెయ్యి వేసి కాచి అందులో కట్టిన గుడ్డను మంచి నడుంచుట్టూ కాపు పెడుతుంటే, నడుంనొప్పి తగ్గిపోతుంది.

నడుము నొప్పితో బాధపడేవారు వంకాయ, వేరుశనగ నూనె, మినప పదార్థాలు, పెరుగు ఎక్కువుగా తీసుకోవడం మంచిది కాదు.