ఆన్లైన్ దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్ పండుగలు పబ్బాలు వస్తున్నాయంటే చాలు మంచి మంచి ఆఫర్లతో వినియోగదారులను ఊరిస్తూ అప్పు చేసి మరీ కొనే పరిస్థితికి తీసుకువస్తుంది. ఇలానే అమెజాన్ సంస్థ చేసిన ఒక చిన్న నిర్వాకం వలన కోట్లలో నష్టం రావడంతో ఇప్పుడు తల పట్టుకోవడం జరుగుతుంది. బ్రిటన్ లో ఉన్న విద్యార్థులను ఆకట్టుకునేందుకు అమెజాన్ సంస్థ “వెల్కమ్ 5” కూపన్ కోడ్ ప్రవేశపెట్టింది. ఈ కూపన్ కోడ్ ఉపయోగించి మొదటిసారి ఆన్లైన్ లో కొన్నవారికి ఉచితంగా 450 రూపాయలు మీ అమెజాన్ పేలోకి యాడ్ అవుతాయని, వాటితో మీకు ఇష్టమైన వస్తువులు కొనుక్కోవచ్చని తెలిపింది. కానీ ఇ ఆఫర్ మొదటిసారి కొనుగోలు చేసే సమాయంలోనే పని చేస్తుందని కండిషన్ పెట్టింది.

ఇక దీనితో ఉచితంగా 450 రూపాయలు వస్తుంటే ఎవరు కాదంటారు. విద్యార్థులందరూ కొనడం మొదలు పెట్టారు. కొంతమంది విద్యార్థులు మరొకసారి కూపన్ కోడ్ పనిచేస్తుందేమో అని ఎంటర్ చేయడంతో రెండవసారి కూడా పనిచేస్తుంది. ఇలా ఎన్నిసార్లు కూపన్ కోడ్ ఇచ్చిన పనిచేయడంతో సాయంత్రానికి బ్రిటన్ మొత్తం వ్యాపించింది. దీనితో 450 రూపాయలతో ఏమి కొనుగోలు చేయవచ్చో అవన్నీ వారింట్లో నింపి పడేసారు.

చివరకు విద్యార్థులు పేస్టులు, బ్రష్ లు కూడా వదలకుండా ఏది ఖాళీగా ఉంటే దానిని కొనిపడేశారు. ఒకసమయంలో అమెజాన్ లో టాప్ సెల్లింగ్ లిస్ట్ లో పేస్ట్ ఉండటం గమనార్హం. ఇలా దాదాపుగా 10 రోజుల పాటు కొనసాగడంతో విద్యార్థులు పండగ చేసుకుంటే అమెజాన్ సంస్థ గుల్లగుల్ల అయిపోయింది. కానీ 10 రోజుల పాటు అమెజాన్ సంస్థ కనిపెట్టలేకపోవడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు.

ఆ తరువాత జరిగిన పొరపాటును గమనించి ఆఫర్ తీసివేయడం జరిగింది. దీనితో అమెజాన్ సంస్థకు కోట్లలో నష్టం వచ్చిందట. కానీ విద్యార్థులు మాత్రం ప్రపంచంలో అత్యంత ధనవంతులైన అమెజాన్ వ్యవస్థాపకులకు ఇదేమి పెద్ద నష్టమేమి కాదని కూని రాగాలు తీస్తున్నారు. అమెజాన్ చేసిన చిన్న పొరపాటుతో విద్యార్థులు మాత్రం మనస్ఫూర్తిగా వారికి కావలసిన వస్తువులు కొనుక్కుని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారట. కూపన్ కోడ్ లో చేసే ఇలాంటి చిన్న చిన్న తప్పులు ఈ కామెర్స్ సంస్థలకు ఒక్కోసమయంలో తీవ్ర నష్టాలను తీసుకొని వస్తాయి.