ప్రపంచం వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంటే… అన్ని దేశాలు కరోనా వైరస్ ను కట్టడి చేయగలుగుతుంటే అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికాలో మాత్రం వైరస్ ను కట్టడి చేయలేక అక్కడ ప్రభుత్వం ఆపసోపాలు పడుతుంది. ఇక ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను అయితే మీడియా కడిగిపారేస్తుంది. దీనికి ట్రంప్ కూడా తనకు ఇష్టమైన మీడియా ప్రతినిధులతోనే ముఖాముఖి భేటీ అవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.

ట్రంప్ నిన్న తీసుకున్న కొత్త నిర్ణయంతో అమెరికా ప్రజలలో ఆందోళన మరింత ఎక్కువైంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రార్ధన మందిరాలను తెరుచుకోవడానికి అనుమతివ్వడంతో అక్కడ మీడియా మరొకసారి ట్రంప్ ను టార్గెట్ చేస్తూ విరుచుకుపడుతుంది. అసలు అన్ని దేశాలలో కరోనా వైరస్ ను కట్టడి చేస్తుంటే అమెరికాలో ఇప్పటికి రోజుకి దాదాపుగా 20 వేల మందికి పైగా కరోనా వైరస్ సోకుతుంటే ప్రార్ధన మందిరాలు ఎలా తెరుస్తారని, ఇలా ప్రార్ధన మందిరాలు తెరిస్తే కరోనా వైరస్ కట్టడి చేయలేమని అంటున్నారు.

గతంలో వాషింగ్టన్ ఒక చర్చిలో మాత ప్రార్థనలలో పాల్గొన్న 54 మందికి కరోనా వైరస్ సోకిన సంఘటన ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉంది. కానీ ట్రంప్ మాత్రం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, ఆర్ధిక పరిస్థితి బలోపేతం చేయడానికి ప్రజలకు ఏమైతే నాకేమిటిలే అన్నట్లు వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ తీసుకునే నిర్ణయాలు, తనవల్ల తన నిర్ణయాల వలన కరోనా వ్యాప్తి చెందలేదని, ఎంతసేపు చైనాపై విమర్శలు చేయడం తాను మరల రాబోయే ఎన్నికలలో గెలవాలన్న హడావిడిపై మాత్రమే దృష్టి పెట్టడంతో ప్రస్తుతమున్న 16 లక్షల కేసులు రాబోయే రోజులలో డబల్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నారు. ఇప్పటికే అమెరికాలో కరోనా వైరస్ సోకి 97 వేల మంది చనిపోయారు. నిన్న ఒక్కరోజే 1293 మంది చనిపోవడంతో అక్కడ పరిస్థితి అద్దం పడుతుంది.

ఒక పచ్చ మీడియా జగన్ సర్కార్ గురించి పెట్టిన పోల్ తీసేయడానికి కారణం?

ఇప్పటికైనా గురూజీని వదిలేయండి సామి, ఇక మీదట అలా చేయడులే