అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తరువాత ఆ వైరస్ వుహాన్ లో ల్యాబ్ లో సృష్టించిన జీవాయుధమని, చైనాను వదిలే సమస్యే లేదని, తాడోపేడో తేల్చుకుంటుమని, చైనాను ప్రపంచంలో ఒంటరిని చేస్తామని ఇలా అనేక ఆరోపణలు చేస్తుంటే చైనా, మరొక బలమైన దేశమైన రష్యాతో కల్సి ఎదురు దాడి చేస్తూ అసలు కరోనా వైరస్ ను అమెరికాలో పుట్టించారని, ఇప్పుడు తమపై నిందలు వేస్తున్నారని ఆరోపణలు చేస్తుంది.

1992 తరువాత అమెరికా ఇంతవరకు అణుపరీక్షలు జరపలేదు. 28 ఏళ్ళ తరువాత అమెరికా మరోసారి అణుపరీక్షలు జరిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రష్యా, చైనాకు గట్టి హెచ్చరికలు పంపడమే అణుపరీక్ష లక్ష్యమని “వాషింగ్టన్ పోస్ట్”తన కథనంలో పేర్కొంది. ర్యాపిడ్ టెస్ట్ తో తమ సత్తా ఏమిటో ఆ రెండు దేశాలకు తెలియచేయాలని చూస్తుంటే అమెరికా చర్యల వలన ఇప్పుడు అన్ని దేశాలు అణ్వయుధాల పరీక్షలకు సన్నద్ధమైతే అంతర్జాతీయంగా అణ్వయుధ పోటీకి దారి తీసే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు. దీనివలన రాబోయే రోజులలో ప్రపంచ యుద్ధానికి దారి తీయదు కదా అని భయపడేవారు ఉన్నారు.

సెలూన్ ద్వారా 91 మందికి కరోనా వైరస్

నంద్యాల ఉపఎన్నిక మొత్తం ఆటనే మార్చేసింది