భారత ప్రధాని నరేంద్ర మోదీపై కేంద్ర హోం మంత్రి అమీత్ షా ప్రశంసల వర్షం కురిపించారు. మోడీ రెండవసారి పీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. 60 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ పాలనలో చేసిన చారిత్రాత్మక తప్పిదాలను ఆరేళ్ళ కాలంలో నరేంద్ర మోదీ సరిచేసి చూపారని అన్నారు. మోదీ గత ఐదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి ఫలితమే మరోసారి అద్భుతమైన విజయాన్ని ప్రజలు కట్టబెట్టారని ఆయన అన్నారు.

ప్రభుత్వ పధకాలను విజయాలను ప్రతి గడపకు చేరవేచిన కోట్లాది కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు. 130 కోట్ల ప్రజలకు మోదీ నాయకత్వ పటిమ మీద అపారమైన నమ్మకం ఉందని ఆయన కష్టపడేతత్వమే ఈ స్థాయికి తీసుకువచ్చిందని అమీత్ షా పేర్కొన్నారు.

బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల వెనుక భూబాగోత నిజాలున్నాయా?

చిరంజీవి భజన కొట్టుకుంటుంటే, జగపతిబాబు నిశ్శబ్దంగా సామజిక సేవ కార్యక్రమాలు