రెండు రోజుల క్రితం తానా వేడుకగా అనసూయ తాను కూడా నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తానని… కొత్తదనాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేయడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. అనసూయ ఎంచుకునే సినిమాల వలే తాను తీసే సినిమాలు కూడా డిఫరెంట్ గా ఉండాలని అభిమానులు ఆశించారు. ఇప్పుడు నిర్మాతగా సినిమాల నిర్మించే ముందు వెబ్ సిరీస్ నిర్మాణంపై కన్నేసినట్లు కనపడుతుంది. వెబ్ సిరీస్ లతో కొత్త టాలెంట్ ను బయటకు తీసి తన సత్తా చాటుకొని తరువాత సినిమాలు నిర్మిస్తుందేమో చూడాలి. జబర్దస్త్ తో సంచలనాలు సృష్టించిన అనసూయ వెబ్ సిరీస్ తో మరెన్ని సంచాలను సృష్టిస్తుందో చూడాలి.

ఇక అనసూయ బాటలోనే మెగా డాటర్ నిహారిక కూడా వెబ్ సిరీస్ ల మీదే పూర్తిగా ఫోకస్ చేయాలనీ డిసైడ్ అయినట్లు కనపడుతుంది. నిహారిక సినిమాల కన్నా వెబ్ సిరీస్ ల ద్వారానే అందరికి సుపరిచితం. వరుసగా ఒక మనస్సు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాలు చేసినా అవి ఆశించినత విజయం సాధించకపోవడంతో… తనకు నచ్చిన కొత్త పంథాలో వెబ్ సిరీస్ పై పూర్తిగా దృష్టిపెట్టి సినిమాలకు దూరం అవ్వాలని అనుకుంటుందట. మెగా హీరోయిన్ గా సిఎంమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారికకు ఇప్పటి వరకు సరైన సక్సెస్ రాకపోవడం కూడా నిహారిక తన నిర్ణయం మార్చుకొని తనకి గుర్తింపునిచ్చిన వెబ్ సిరీస్ మీదే ఫోకస్ చేయాలనుకుని ఉండవచ్చు.     
  •  
  •  
  •  
  •  
  •  
  •