బిగ్ బాస్ 3 తెలుగు సీజన్ విజేతగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గెలిచి అందరి అంచనాలను తారుమారు చేశాడు. ఒక సామాన్యమైన వ్యక్తిగా హౌస్ లోకి అడుగుపెట్టిన రాహుల్ చివరకి గట్టి పోటీ ఇవ్వడంతో పాటు అభిమానుల మద్దతుతో బిగ్ బాస్ విజేతగా నిలిచాడు. చివరి వరకు యాంకర్ శ్రీముఖి మంచి పోటీ ఇచ్చినప్పటికీ గెలవలేకపోయింది. ఇప్పటి వరకు జరిగిన రెండు సీజన్లలో పురుష కంటెస్టెంట్ లు గెలిచారు, ఈసారి మహిళ అయిన శ్రీముఖిని గెలిపించుకుందామని అందరూ ఎంత ప్రచారం చేసినా పట్టించుకోలేదు.

దీని గురించి ఝాన్సీ ఇంకా మాట్లాడుతూ అమెరికా లాంటి దేశంలోనే మహిలను అధ్యక్షురాలిగా చేసుకోవడానికి అక్కడ ప్రజలు ఇష్టపడ లేదని, అలాంటిది ఇక్కడ ప్రేక్షకులు మాత్రం బిగ్ బాస్ విజేతగా మహిళను ఎలా గెలిపిస్తారని ప్రశ్నించింది. లింగభేదం ఇప్పటికి ఉందని సోషల్ మీడియా ద్వారా తన స్పందన తెలియచేసింది. బిగ్ బాస్ హౌస్ లో తన తోటి యాంకర్ శ్రీముఖి పెర్ఫార్మన్స్ పై ప్రశంసలు కురిపించింది.