శ్వేతా రెడ్డి తన పోరాటాన్ని ఇంకా ఆపినట్లు కనపడటం లేదు. బిగ్ బాస్ మొదలై రెండు వారాలు గడుస్తున్నా, శ్వేతా రెడ్డి మాత్రం ప్రెస్ మీట్స్ తో పాటు యూట్యూబ్ చానెల్స్ లో కూడా గొడవ చేస్తూనే ఉంది. మరో వైపు నాగార్జున తన భార్య, తన కోడలు సమంతను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించి ఇలా నాలుగు గోడల మధ్యలో జంతువులా ఉంచగలడా అన్నట్లు మాట్లాడుతూ… నాగార్జున బిగ్ బాస్ గురించి రియాక్ట్ అవ్వాలని చెబుతుంది. అసలు బిగ్ బాస్ షో ఆపేయాలని మనుషులను లోపల పెట్టి బయట ప్రపంచానికి తెలియకుండా డబ్బు ఎరగా వేసి హింసిస్తున్నారని శ్వేతా రెడ్డి ఆరోపణల పట్ల కొంత మంది మద్దతు తెలుపుతుంటే, మరికొంత మంది విమర్శిస్తున్నారు. బిగ్ బాస్ యాజమాన్యంపై శ్వేతారెడ్డి పోలీసులకు కంప్లైన్ట్ ఇవ్వడంతో ఎంక్వయిరీ కూడా జరుగుతుంది.

అసలు ఇంతకీ శ్వేతారెడ్డికి బిగ్ బాస్ హౌస్ తో వచ్చిన గొడవ ఎక్కడంటే… శ్వేతారెడ్డిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకుంటామని చెప్పి ఆమెతో రెండు మూడు దఫాలుగా చర్చలు జరిపి చివరకు నిన్ను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకుంటే మాకేంటి అని అడిగారని ఆరోపణలు చేసింది. ఒకే ఇంత వరకు బాగానే ఉంది…. అసలు ముందుగా శ్వేతారెడ్డి చెప్పినట్లు అలా నిజంగా అడిగితే బొక్కలో వేసి సెక్సువల్ గా హింసించాలని చూసిన వెదవ మక్కెలు విరగగొట్టాలి. కానీ ఇక్కడ శ్వేతారెడ్డి కూడా ఆ రీతిలో పోరాటం చేస్తే అందరూ మద్దతు ఇచ్చేవారు. కానీ శ్వేతారెడ్డి ట్రాక్ తప్పి ఆరోపణలు చేయడంతో కొంత మంది ఆమెను విమర్శిస్తున్నారు.

నన్ను సెక్సువల్ హార్స్మెంట్ చేశారురా బాబోయ్ అని మొత్తుకున్న శ్వేతారెడ్డి ఇప్పుడు గొంతు ఇంకాస్త సవరించుకొని జంతువులులా నాలుగు గోడల మధ్యలో 15 మందిని వేసి బిగ్ బాస్ యాజమాన్యం  హింసిస్తున్నారని అంటుంది. అసలు శ్వేతారెడ్డి కూడా అలా నాలుగు గోడల మధ్యలో ఉండటానికి ముందు అగ్రిమెంట్ పై సంతకం చేసిన తరువాతే కదా బిగ్ బాస్ యాజమాన్యం ఆమెతో సంప్రదింపులు చేసింది. తనను బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదించినప్పుడే శ్వేతారెడ్డి నాలుగు గోడల మధ్య జంతువులా జీవించడానికి నన్ను అడిగే దైర్యం మీకెక్కడదని నిలదీసి ఉంటే శ్వేతారెడ్డికి ఇప్పుడు ఇలా ప్రశ్నించవలసిన అవసరం ఉండేది కాదు. 

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడానికి ఇష్టపడిన శ్వేతారెడ్డి… ఇప్పుడు అదే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ రాకపోవడంతో పాటు సెక్సువల్ గా ఇబ్బంది పెట్టారని చెప్పి… బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారిని హింసిస్తున్నారని ఎలా చెబుతావు అంటూ నెటిజన్లు సోషల్ మీడియా సాక్షిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్వేతారెడ్డి మనస్సులో ఇంకా ఏదో పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తుందని కొంత మంది వాపోవడం కూడా జరుగుతుంది. శ్వేతారెడ్డి తనకు జరిగిన అన్యాయం మీద పోరాటం చేస్తే బాగానే ఉంటుంది. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన వారిని హింసిస్తున్నారని మీరెలా చెబుతారు… అందరూ వారి ఇష్టపూర్వకంగానే వెళ్లారు… వారేమి పాలు తాగే పసిపిల్లలు కాదు కదా… ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు అనుభవించి ఒక స్థాయికి చేరుకున్న తరువాత వారంటే ఏమిటో నిరూపించుకోవడానికి ఆడుతున్న ఒక రియాలిటీ గేమ్ షో అంతే తప్ప… ఇలా లేనిపోని ఆరోపణలతో శ్వేతారెడ్డి ఇలా దిగజారడం బాధాకరం. 

 
  •  
  •  
  •  
  •  
  •  
  •