యాంకర్ శ్యామల బుల్లితెర టీవీ షో ల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. బిగ్ బాస్ షో తరువాత మరింత పాపులర్ అయిన శ్యామల అడపాదడపా సినిమాలలో కూడా నటిస్తూ నటిగా కూడా ఆకట్టుకుంది. అయితే శ్యామల గత 2019 సార్వత్రిక ఎన్నికల ముందు జగన్ సమక్షంలో ఆమె భర్తతో కలసి వైసీపీలో చేరి ఆ పార్టీకి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే శ్యామల రాజకీయాలలోకి అడుగుపెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఎన్నికల సమయంలో కాస్త హడావిడి చేసిన శ్యామల.. ఆ తరువాత పార్టీలో ఎక్కడా కనిపించలేదు. ఆమె వైసీపీకి దూరమయ్యిందా అనే అనుమానాలు కొందరిలో కలిగాయి.

ఇక ఇదే విషయంపై తాజాగా స్పందించింది శ్యామల. ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఇంట్లోనే గడుపుతూ అభిమానులతో పలు విషయాలను పంచుకుంటున్నారు. నాకు వైఎస్సార్, జగన్ అంటే ఇష్టమని అందువల్లే వైసీపీలో చేరానని శ్యామల చెప్పారు. అందుకే ఆయనతో కలసి పనిచేసే ఛాన్స్ వస్తే వదులుకోకూడదని.. ఆ పార్టీలో చేరి ఎన్నికల సమయంలో పార్టీ తరుపున పనిచేశానని అన్నారు. అయితే నేను పార్టీకి దూరం కాలేదని.. నా పనుల్లో నేను బిజీగా ఉన్నానని చెప్పారు.

ఇక పార్టీని అధికారంలోకి తేవడానికి జగన్ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని.. ఆయన ఒకమాట ఇచ్చారంటే ఖచ్చితంగా అమలుచేస్తారన్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే 90 శాతం హామీలను అమలు చేశారని.. ఒక్క సంవత్సరంలోనే ఇన్ని చేసిన జగన్.. ఇంకా రాబోయే నాలుగేళ్లలో ఇంకెంతా చేస్తారోనని ఆమె అన్నారు. జగన్ సీఎం అయిన తరువాత ఆయనను కలవలేదని తరువాత తప్పకుండా కలుస్తానంటూ చెప్పుకొచ్చింది యాంకర్ శ్యామల.

ఏపీలో తొలిసారి ఇంటిదగ్గరే హోం ఐసోలేషన్

ప్రపంచం మొత్తం జ్యోతి కుమారి గురించే చర్చ, ఆమె చేసిన సాహసం ఒక చరిత్రాత్మకం