తెలంగాణ సీఎం కెసిఆర్ కి తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ లోను అభిమానులున్నారనే సంగతి తెలిసిందే. ఆయన గతంలో విజయవాడ దుర్గ గుడికి వచ్చినప్పుడు ఏపీలో ఆయనకు ఫ్లెక్సీలు వెలిశాయి. తాజాగా ఓ ఆంధ్రా యువకుడు కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటూ.. తన నాలుకను కోసి దేవుడి మొక్కు తీర్చుకున్నాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన బంజారాహిల్స్‌లోని బుధవారం ఓ ఆలయంలో చోటు చేసుకుంది.

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలానికి చెందిన మహేశ్‌కు కేసీఆర్‌ అంటే ఇష్టమని తెలుస్తోంది. తెలంగాణ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ.. బంజారాహిల్స్‌లోని ఓ ఆలయంలో నాలుకను కోసుకున్నాడు. కోసిన నాలుకను దేవాలయం హుండీలో కానుకగా వేసి మొక్కు తీర్చుకున్నాడు. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావం అయింది. అతన్ని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నారు.