నెల్లూరు జిలాల్ నుంచి స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి బీసీలకు మంత్రి పదవి ఇచ్చిన ఏకైక పార్టీ వైసీపీ పార్టీ అని, ఈమధ్య నెల్లూరు జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో జగన్ సమక్షంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. తాను జన్మ జన్మలకు సీఎం జగన్ గారికి రుణపడి ఉంటానని, నమ్ముకున్న నాయకుడి కోసం తాను ఎంత కష్టపడ్డానో అదే విధంగా తనకు సీఎం జగన్ గారు ప్రతిసారి గుర్తింపునిస్తున్నారని గొప్పగా చెప్పారు. ఇప్పుడున్న వైసీపీ మంత్రి వర్గంలో యువ మంత్రిగా అత్యంత బాధ్యతాయుతమైన నీటిపారుదల శాఖను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. సీఎం జగన్ ను ఎవరైనా ఏమైనా అంటే మాత్రం ప్రతిపక్ష పార్టీ సభ్యుల మీద విరుచుకు పడటానికి ఏ మాత్రం వెనకడుగు వేయడు.

అలాంటి అనిల్ కుమార్ యాదవ్ BDS (డెంటల్) విద్యను పూర్తి చేసిన తరువాత ఖాళీగా తిరుగుతుంటే అతడి తల్లికి ఖాళీగా తిరగడం నచ్చక ఏదైనా ఉద్యోగం చేయమని గొడవ చేస్తే నారాయణ కాలేజీలో ఉద్యోగం కోసం అప్లై చేస్తే రాలేదట. మరొకసారి అప్లై చేస్తే మూడు నెలలు వెయిట్ చేయమన్నారట. కానీ అతడికి ఉద్యోగం చేయడం ఇష్టం లేక అప్పట్లో యువజన కాంగ్రెస్ లో చురుకైన పాత్ర పోషించేవాడట. దానితో రాజకీయాల మీద ఆసక్తితో కార్పొరేటర్ గా గెలిచి తరువాత 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణారెడ్డిపై స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

ఆ తరువాత జగన్ మోహన్ రెడ్డ్ సారధ్యంలో ఏర్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రతిపక్ష సభ్యుడిగా అధికార పక్షంపై పోరాడి రెండవ సారి మంత్రి అయ్యారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెబుతూ అప్పుడు కనుక తనకు నారాయణ కాలేజీలో ఉద్యోగం వచ్చి ఉంటే తాను లెక్చరర్ గానే ఉండిపోయేవాడినని, ఒకరకంగా సీటు రాకపోవడంతో తాను ఎమ్మెల్యేగా… ఇప్పుడు మంత్రి అయ్యే అవకాశం ఉండేది కాదన్నారు. అదే నారాయణ కాలేజ్ ఛైర్మెన్ నారాయణపై గత ఎన్నికలలో పోటీ చేసి మంచి విజయాన్ని నమోదు చేసుకోవడం కొసమెరుపు.