అనుష్క అలియాస్ స్వీటీ ఎప్పుడు వార్తలలో నిలుస్తుంటుంది. ఆ వార్తలు ఏవైనా కావచ్చు కాని వాటిపై అనుష్క ఎప్పుడు స్పందించిన ధాఖలాలు లేవు. ఇప్పటి వరకు అనుష్క త్వరలో ప్రభాస్ ను పెళ్లి చేసుకోబోతుందని, వారిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని, వారిద్దరూ రహస్యంగా నెలకు ఒకసారి కలుస్తుంటారని, ఇలా వారిద్దరిపై అనేకానేక రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ ఫేక్ అని ప్రభాస్ తరుపున వారు చెబుతూనే ఉంటారు. కాని ప్రభాస్ తో ఉన్న చనువుతో అభిమానులు కూడా నిజమే అని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇక ఇప్పుడు కొత్తగా పుట్టిస్తున్న రూమర్స్ అనుష్క పీకల్లోతు ప్రేమలో ఒక యువ ప్రముఖ క్రికెటర్ తో మునిగిపోయిందని త్వరలో అతడితో అనుష్క పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయని, వారిద్దరూ ఎప్పుడు ఖాళీ దొరికినా దొంగ చాటుగా కలుస్తుంటారని, గంటల తరబడి ఫోన్ లో మాట్లాడుకుంటారని చెబుతున్నారు. ఇంతకు ఆ క్రికెటర్ ఎవరని అంటే మాత్రం అనుష్క ఎవరకి చెప్పకుండా దాచి పెడుతుందని, అనుష్కను దగ్గర చూసే వారికి కూడా ఇది పెద్ద సీక్రెట్ గా ఉందని ఇలా అనేక రకాల కథలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు రూమర్లు ప్రభాస్ నుంచి ఏకంగా భారత్ క్రికెటర్ పైకి మల్లాయని తెలుస్తుంది. కాని అనుష్క మాత్రం ఇవేవి పట్టించుకోకుండా తన సినిమాలు తాను చేసుకుంటూ ముందుకు పోతుంది. త్వరలో అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది