అనుష్క నటించిన “నిశ్శబ్ధం” సినిమా వచ్చే అక్టోబర్ 2వ తేదీన ఓటిటి ద్వారా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే మొదలైపోయాయి. ఏదైనా కొత్త సినిమా విడుదలవుతుంటే దానికి సంబంధించిన ప్రమోషన్స్ గట్రా బిగ్ బాస్ వేదిక మీద నుంచి చేసుకోవడం ఏ ఇండస్ట్రీలో అయినా సర్వ సాధారణమైపోయింది. అలానే “నిశ్శబ్ధం” టీమ్ కూడా అనుష్కను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాలని ప్రయత్నించారు.

కానీ కరోనా సమయంలో ఆమెను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించడం కుదరదని బిగ్ బాస్ టీమ్ తేల్చి చెప్పేశారట. ఒకవేళ అనుష్కను కనుక బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాలని అనుకుంటే ఆమె కరోనా టెస్ట్ చేయించుకొని వారం రోజుల పాటు క్వారంటైన్ లో ఉండవలసిన అవకాశం ఉంది. అందుకే బిగ్ బాస్ టీమ్ ఆమెకు పర్మిషన్ ఇచ్చినట్లు లేదని తెలుస్తుంది. ఒకవేళ అనుష్కకు కనుక కరోనా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ మొత్తం రచ్చ రచ్చ అయిపోతుందని భయమే అనుష్కకు ఎంట్రీ దొరకలేదని తెలుస్తుంది. ఇక వచ్చే వారం ఏమైనా అనుష్క బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి. ఈ వారం అయితే అనుష్క ఎంట్రీ లేనట్లే.

ఈ వారం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేదెవరో తెలియక పిచ్చెక్కిపోతున్నారట

అప్పుడు ఘంటసాలకు జరిగిన అవమానం ఇప్పుడు బాలుకి జరిగిందని అభిమానుల ఆవేదన

తండ్రి ఆటలో తనను మోసం చేసాడని కోర్టుకెక్కిన 24 ఏళ్ళ యువతి