కథానాయక ప్రాధాన్యం ఉన్న పాత్రలంటే ముందుగా దర్శకనిర్మాతలకు గుర్తొచ్చే పేరు అనుష్క. అరుంధతి, బాహుబలి, భాగమతి, రుద్రమ్మదేవి వంటి వైవిధ్యమైన సినిమాలలో నటించి మెప్పించింది. ఇక అనుష్క నటించే సినిమాలకు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా వస్తాయి. ప్రస్తతం అనుష్క ‘నిశ్శబ్దం’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకు గాను ఆమె 3.5 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. సౌత్ లో నయనతార తర్వాత అనుష్క మాత్రమే ఈ మేరకు పారితోషికం తీసుకుంటారంటున్నారు. నయనతార కథానాయక ప్రాధాన్యం ఉన్న సినిమాలో 6 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాధవన్, షాలిని పాండే, సుబ్బరాజు, అంజలి తదితర నటులు కీలక పాత్రలో నటించారు. రచయిత కోనా వెంకట్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ కు విపరీతమైన స్పందన వచ్చింది. ఇక త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.