చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న “సైరా నరసింహారెడ్డి” అన్ని పనులు ముగించుకొని అక్టోబర్ 2వ తారీకు విడుదలకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా అనుష్క ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర చేస్తుంది. ఇప్పటి వరకు అనుష్క పాత్రపై క్లారిటీ రాకపోయినా ఈ సినిమాలో “ఝాన్సీ లక్ష్మీభాయ్”గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. అనుష్క ఇప్పటికే ఈ తరహా పాత్రలు చేయడంతో ఝాన్సీ లక్ష్మీబాయ్ గా ఎలా మెప్పిస్తుందో చూడాలి.

ఈ సినిమాలో మిగతా పాత్రలలో తమన్నా, అమితాబచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సందీప్, ప్రగ్యా జైశ్వాల్, జగపతి బాబు లాంటి కీలక నటులు నటిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాతగా రామ్ చరణ్ తేజ్… కొణిదెల ప్రొడక్షన్ పై నిర్మించారు. త్వరలో విడుదల చేయబోయే టీజర్ లో పవన్ కళ్యాణ్ చేత వాయిస్ ఓవర్ చెప్పించినట్లు తెలుస్తుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపుగా 200 కోట్ల బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ బాషలలో విడుదల చేయనున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •